ఉపాధ్యాయునికి ఘనంగా గ్రామస్తుల సన్మానం
టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మారుమూల గిరిజన తండా అయిన మొక్కంపాడు తండా గ్రామం నుండి అదే గ్రామానికి చెందిన బానోతు రవి కి ఆ గ్రామంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చినందుకు ఆ గ్రామస్తులందరూ గురుపూజోత్సవం సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఉద్యోగం రాకముందు సోషల్ సర్వీస్ చేస్తూ మొకంపాడు తండా తో పాటు మండలంలో తన వంతు కృషి చేస్తూ ఉండేవారు. ప్రశ్నించే తత్వం కలిగిన రవి ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను చక్కని క్రమశిక్షణతో విద్యాబుద్ధులను నేర్పి ఉన్నత స్థానాలకు ఎదగడానికి తన వృత్తి ధర్మాన్ని చేకూరుస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సన్మాన కార్యక్రమంలో మొకం పాడు తండా ఉపసర్పంచ్ మాలోతు రామదాసు నాయక్ ,గ్రామ పెద్దలు బానోతు వాలు నాయక్ ,మాలోతు భీమా నాయక్, మోతిలాల్ నాయక్, ఏ రవి, మాలోత్ నరేష్, గవాస్కార్ ,భూక్య సుభాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.