Wednesday, 4 November 2026

ఉపాధ్యాయులు పిరియడ్ ప్రణాళికను తప్పనిసరిగా అమలు చేయాలి – డీఈవో గోవిందరాజులు

*స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు మెమొలు జారీ చేయాలి*
బిజినేపల్లి. జనం సాక్షి. సెప్టెంబర్.20.
విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను పెంచడానికి ఉపాధ్యాయులు  సమర్థవంతమైన పీరియడ్ ప్రణాలికను అమలు చేయాలని ఉపాధ్యాయులను డిఈవో గోవిందరాజులు ఆదేశించారు.
మంగళవారం తిమ్మాజిపేట, బిజినపల్లి మండల కేంద్రాల్లో కొనసాగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బిజినపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న గణిత స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ఏడుగురు గణిత ఉపాధ్యాయుల గైర్హాజర్ పై అసహనం వ్యక్తం చేశారు.
పాలెం పాఠశాలకు చెందిన  నాగరాజ్ అనే గణిత ఉపాధ్యాయుడు అటెండెన్స్ లో రెండు పూటల సంతకాలు చేసి గైర్హాజర్ అవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరు కానీ ఉపాధ్యాయుల ఒకరోజు జీతాన్ని నిలుపగల చేసి, మెమోలు జారీ చేయాలని, స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుని డిఇఓ ఆదేశించారు.
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకి ఉపాధ్యాయులకు ఎలాంటి సెలవులు లేవని తప్పనిసరిగా స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులను ఉద్దేశించి డిఈఓ మాట్లాడుతూ….
 సబ్జెక్ట్ ఉపాధ్యాయులు తమ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌లను ఎల్లప్పుడూ తరగతి గదుల్లో ఉంచాలన్నారు.
ఎన్సీఈఆర్టీ నుండి అన్ని పాఠశాలలకు గణిత కిట్లను ఇదివరకే అందించడం జరిగిందని వాటిని తరగతి గదిలో ప్రదర్శించి విద్యార్థులకు గణితంపై మక్కువ పెంచేలా చేయాలన్నారు.
తరగతి గదిలో ఉపాధ్యాయులు పీరియడ్ ప్రణాళికను తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించారు.
స్కూల్ కాంప్లెక్స్ లో నేర్చుకున్న అంశాలు తరగతి గదిలో అమలు చేసే విధంగా చర్చ జరగాలని, తరగతిగదిలోను విద్యార్థులతో చర్చావంతం బోధన చేపట్టాలన్నారు.
ప్రాథమిక స్థాయి విద్యార్థుల కనీస సామర్థ్యాలు పెంచేలా ఎఫ్ ఎల్ యం కార్యక్రమాలను పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
వారం వారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపరచాలని, ఏప్రిల్ 23న తమ సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలపై ప్రతి ఉపాధ్యాయుడు సబ్జెక్టుల వారిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
విద్యా హక్కు చట్ట ప్రకారం విద్యార్థుల సామర్థ్యాల బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని గుర్తు చేశారు.
సామర్ధ్యాలపై జాతీయస్థాయి సామర్ధ్యాల పరీక్షల అనంతరం సామర్థ్యాలను పెంచేలా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
తొలిమెట్టు నిర్వహణపై ఉపాధ్యాయుల వారీగా అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆంగ్లంలోనే మాట్లాడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ఇప్పటినుండే ప్రణాళికాబద్ధంగా తరగతులు నిర్వహించాలన్నారు.
అంతకుముందు తిమ్మాజీపేట, వట్టెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకత నిర్వహించి ప్రతిరోజు వాట్సాప్ ద్వారా ఫోటోలను పంపాలని ఆదేశించారు.
దాత సహకారంతో అతి పెద్ద టెలిస్కో వట్టెం పాఠశాలకు అందించిన టెలిస్కోప్ ను విద్యార్థుల వినియోగానికి అందుబాటులో ఉంచి గ్రహాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
వంటగదిని పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత ప్రమాణాలతో భోజనాన్ని వండాలని సూచించారు జూన్ నాటికి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులన్నీ మంజూరు అయ్యాయని వంట వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజినపల్లి మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, బిజినపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు  రాములు నాయక్, తిమ్మాజిపేట ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area