హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నారు. మార్చి 1-15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఏప్రిల్ 9న పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9.30గం. నుంచి మధ్యాహ్నం 12వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30గం. నుంచి సాయంత్రం 5వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 23న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.




