Monday, 2 November 2026

ఆ గృహాలు ధనికుల ఇళ్లలా ఉండాలి

C

కులం, మతం బేధం లేకుండా ప్రతిపేద వారికి డబుల్‌ బెడ్‌రూం

నివాసయోగ్యమైన స్థలంలో ఇండ్ల నిర్మాణం

గ్రేటర్‌ పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 4,740 ఇండ్లు

లబ్ధిదారుల ఎంపిక పారదర్శకత ఉండాలి

ప్రభుత్వంపై నమ్మకంతోనే దరఖాస్తులు అధికం

డబుల్‌ బెడ్‌రూంలపై సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 27(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఎవరైనా చూస్తే ఇవి గరీబోళ్ల ఇండ్లు కావు.. ధనికులవి అనేలా ఉండాలని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. గ్రేటర్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కార్యక్రమం అమలుపై సీఎం సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ్రేటర్‌ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి సుమారు 4,740 చొప్పున డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించేందుకు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నివాసయోగ్యమైన చక్కటి స్థలాలను గుర్తించాలని చెప్పారు. చక్కటి టవర్లను అందంగా నిర్మించాలని సూచించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తులు వెలువెత్తడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అధికంగా రావడానికి ప్రభుత్వం ఇచ్చిన మాటపై ప్రజలకు నమ్మకం కలగడమే అందుకు కారణమని చెప్పారు. కులం, మతం బేధం లేకుండా ప్రతిపేద వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని ఉద్ఘాటించారు. ఇండ్ల నిర్మాణంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌కు సీఎం పలు సూచనలు చేశారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత రెవెన్యూ అధికారులదేనని సీఎం స్పష్టం చేసింది. ఇండ్ల స్థలాలను గుర్తించేందుకు స్థానిక ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలని చెప్పారు. గత ప్రభుత్వాల విధానాలకు తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉందని తెలిపారు. పేదలకు లబ్ధి చేకూరే విషయంలో రాజకీయాలకు తావివ్వమని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకతో నిర్వహించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నగరం నడిబొడ్డున ఉన్న మురికివాడలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఎక్కడివారికి అక్కడే అనే విధానంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణం సాగాలన్నారు. ఇటీవల నిర్మించి ఇచ్చిన ఐడీహెచ్‌ కాలనీ తరహాలో భవిష్యత్‌ నిర్మాణాలుండాలని ఆదేశించారు సీఎం. ఈ సవిూక్షలో ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్‌, ప్రకాశ్‌ గౌడ్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పురోగతిని సీఎంకు కలెక్టర్‌ వివరించారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల వివరాలు, సేకరించిన ఖాళీ స్థలాల గురించి కలెక్టర్‌ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *