*ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారిని గెలిపించండి.*

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి):
శ్రీరంగాపురం మండలంలో  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులందరికీ పి ఆర్ టి యు టి యస్ శ్రీరంగాపురం మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ సి ఓటు నమోదు పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దాసరి చిన్న రాములు గారు మాట్లాడుతూ పి ఆర్ టి యు టి యస్ రాష్ట్ర శాఖ బలపరిచిన ఎమ్ ఎల్ సి అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి గారి గెలుపే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మార్గమని, అతి త్వరలోనే ఉపాధ్యాయులందరికీ పదోన్నతులు, బదిలీలు జరుగనున్నాయని, కాంట్రాక్ట్ జె ఎల్ పోస్టులు రెగ్యులరైజేషన్ కాబోతున్నాయని, వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయండి అని అభ్యర్థిస్తామని  ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శివశంకర్ యాదవ్, మండల కార్యవర్గ సభ్యులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.