Wednesday, 4 November 2026

ఉప్పలపహాడ్ గ్రామంలో డబుల్ బెడ్రూంల కేటాయింపు పై తక్షణమే విచారణ జరపాలి

c(ఎం) జులై   (జనం సాక్షి )
ఆత్మకూరు మండలం ఉప్పలపహాడ్ గ్రామంలో రెండు పడకల ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారిందని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య ఆరోపించారు ఉప్పలపహాడ్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో సమగ్ర విచారణ జరిపించి అర్హులైన వారికి అందించాలని కోరారు అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధుల అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి జడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి సర్పంచ్ జన్నాయికోడె నాగేష్ బత్తిని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area