Tuesday, 3 November 2026

మంచా తండాలో భూ వివాదం

– అవమానంగా భావించి పురుగుల మందు త్రాగి చికిత్స పొందుతూ మృతి,
కురవి జూలై -18
 (జనం సాక్షి న్యూస్)
కురవి మండలం ఎలక చెట్టు తండా గ్రామపంచాయతీ పరిధిలోని మంచా తండాలో భూక్య వెంకన్న అతని అన్న భూక్య బాలు   కు మధ్య ఇంటి స్థలము విషయంలో గొడవలు కాగా అట్టి గొడవలో భూక్య బాలు అతని కుమారుడు అయిన భూఖ్య ప్రవీణ్ , భూఖ్య సురేష్ అతనిని చేతులతోకొట్టి, కాళ్లతో తన్నగా అతను అవమానంగా భావించి తన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోగా అది గ్రహించిన అతని కుటుంబం  అతని మహబూబాబాద్ ఏరియా హాస్పటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విసమించేసరికి ఆదివారం  ఖమ్మం లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా సోమవారం తెల్లవారుజామున భూఖ్య వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా కురవి ఎస్సై బి రాము పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. సంఘటన జరిగిన రోజున భూక్యా వెంకన్న కుమారుడు వీరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగిందని, చనిపోయిన వ్యక్తి శవం పై పంచానామ నిర్వహించి పోస్టుమార్టం అనంతరం దహన కార్యక్రమాలకు వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు కురవి ఎస్ఐ రాము నాయక్ తెలిపారు.
Attachments area