ఉప్పలపాడు చెరువు పరిధిలోని కాలువలు వెంటనే మరమ్మత్తు చేయాలి:కిసాన్ కాంగ్రెస్ సెల్ ఉపాధ్యక్షులు పోట్ల విద్యాసాగర్

బయ్యారం,జులై21(జనంసాక్షి):
 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు పరిధిలోని చెరువు కింది కాలువలు పూడికతీత లేక అస్తవ్యస్తంగా అయ్యాయని బయ్యారం మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పోట్ల విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  గతంలో ఉప్పలపాడు నుండి గౌరారం వరకు గల చెరువు సంబంధించిన పూడికతీతలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వినతి పత్రం ఇచ్చినప్పటికి ఎటువంటి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు.
ఉప్పలపాడు చెరువు తూము షట్టర్లు పూర్తిగా పోవడం వలన నీరు ఈ మధ్య కురిసిన వర్షాలకు చెరువు నీరు కాలువల ద్వారా విడుదల కాగా తూము షట్టర్లు పనిచేయకపోవడంతో చెరువులో నీరు నిల్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువును నమ్ముకొని ఇప్పటికే వరి నారు పోసుకున్న రైతులకు నిరాశే మిగిలిందని వాపోయారు. తక్షణమే ఉప్పలపాడు కాలువలు పూడికతీత చేపట్టి, షట్టర్ మరమ్మత్తులు జరిపించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ తరుపున డిమాండ్ చేశారు.
Attachments area