ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు నల్లేరుమిద నడికే

*ఎంపి బడుగుల లింగయ్య యాదవ్
మునుగోడు సెప్టెంబర్27(జనంసాక్షి):
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరుమిద నడికేనని రాజ్యసభసభ్యులు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతు బీజేపీ కేంద్రప్రభుత్వం దమ్ముంటే,తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని సవాల్ చేశారు.మొదటగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు నియోజకవర్గంలో ప్రజలంతా ఉత్సాహంగా వున్నారని తెరాసా అభ్యర్ధి బారి మెజారిటీతో విజయం సాధించడం కాయమన్నారు.రాష్ట్రములో 200 రూపాయిలు వున్న పింఛన్లు2000 రూపాయలు చేయడం జరిగిందని,ప్రతి గ్రామాల్లో మౌలికవసతుల కల్పించడం జరిగిందన్నారు.మాజీఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా వుండి ప్రజల్లోకి రాలేదని,సమస్యలు పరిష్కరించలేదని,ఓట్లుఅడిగే అర్హత కూడా కోల్పోయారన్నారు.ఈకార్యక్రమములో గ్రామసర్పంచ్ మిరియాల వెంకటేశ్వర్లు,ఎంపీపీ కర్ణాటక స్వామి,ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి,కార్యదర్శి మురళిమోహన్,రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు నాగరాజుగౌడ్,ఎంపిటిసిలు శ్రావణి,నిర్మల శరత్,మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.