Tuesday, 3 November 2026

నష్టపోయిన ప్రజలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

నిర్మల్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): వరదలతో నష్టం వాటిల్లిన ప్రజలను ఆదుకుంటామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. పంటలు నష్టపోయిన వారికి అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే ఆమె గ్రామాల్లో అధికారులను వెంట పెట్టుకొని పర్యటించారు. నష్టం జరిగిన ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. రోడ్డు కల్వర్టులు, కాలువలకు గండి పడి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, అధికారులు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించారు.