హైదరాబాద్,ఆగస్ట్9(జనం సాక్షి): నగరంలోని ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లారెడ్డిగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన మేకల కోటిరెడ్డి స్థానిక సద్గురు విలాస్ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని చనిపోయాడు. కోటిరెడ్డి రెండ్రోజుల క్రితం ఎల్లారెడ్డిగూడలోని బంధువుల ఇంటికొచ్చినట్లుగా సమాచారం. నగదు విషయమై చర్చించేందుకు బంధువుల ఇంటికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




