మేడ్చల్,జూన్5(జనం సాక్షి): అదుపుతప్పి లారీ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్ నుంచి ఉల్లిగడ్డ లోడ్ వేసుకుని లారీలో డ్రైవర్, క్లీనర్‌తోపాటు నలుగురు వ్యక్తులు హైదరాబాద్ మార్కెట్‌కు బయలుదేరారు నందిగామ మండల పరిధిలోని చాకలిగుట్ట తండా సవిూపంలోగల బైపాస్ రోడ్డు పక్కన ఆగిఉన్న మరో లారీని ఉల్లిగడ్డ లోడ్ లారీ వెనుక నుంచి ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళ రామలక్ష్మి(35), క్లీనర్ నాగరాజు(35) ఉల్లిగడ్డ సంచుల కిందపడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. మృతురాలి కుమారుడు మాదప్ప వీరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింహారెడ్డి తెలిపారు.




