Wednesday, 4 November 2026

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

అర్బన్‌ ఫారెస్ట్రీని పెంచాలి

ప్లాస్టిక్‌ బదులు జ్యూట్‌ సంచులు వాడాలి

కమిషనరేట్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో ఆయన పలు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పర్యావరణ స్పృహను, అవగాహనను పెంచేందుకు జూన్‌5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. ఈ సంవత్సరం వరల్డ్‌ ఎన్విరాన్మెంట్‌ డే థీమ్‌ బీట్‌ ద ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ అని అన్నారు. కావున పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగులు వాడకం మంచిదాని చెప్పారు. భవిష్యత్‌ తరాలకు మనమిచ్చే గొప్ప బహుమతి పచ్చని చెట్లు స్వచ్ఛమైన గాలి అన్నారు. అర్బన్‌ ఫారెస్టీని పెంచితే వాయు కాలుష్యం నుంచి రక్షణ పొందొచ్చన్నారు. ఇంటి ఆవరణ, ఆఫీస్‌ సముదాయంలో మొక్కలు పెంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్లో సుమారు పండ్ల మొక్కలు, నీడనిచ్చే 150 మొక్కలు నాటుతున్నామన్నారు. ఇందులో సపోటా, మామిడి, జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, వేప, రావి, గానుగ వంటి నీడనిచ్చే మొక్కలు ఉన్నాయన్నారు. 1972 లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. 1973 లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారన్నారు. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచ పర్యావరణ దినోత్సవమును జూన్‌ 5 తేదిన జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం సంతోషమన్నారు. హరితహారం వంటి కార్యక్రమాలు మొక్కల పెంపకాన్ని పెంచుతుందన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పోలీస్‌ సిబ్బంది, విూడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్‌ ఎస్‌.ఎం. విజయ్‌ కుమార్‌, డీసీపీ కైమ్స్ర్‌ జానకీ షర్మిలా, డీసీపీ షీ టీం అనసూయ, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ కె. నరసింహ, అడిషనల్‌ డీసీపీ సిఏఆర్‌ మాణిక్‌ రాజ్‌, ఎస్బీ ఏసీపీ (పాస్‌ పోర్ట్‌) రవీందర్‌ రెడ్డి, ఎస్బీ ఏసీపీ అడ్మిన్‌ సుధీర్‌ కుమార్‌, ఏసీపీ సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ శంకర్‌ నాయక్‌, ఆర్‌ఐలు వెంకటస్వామి, చక్రవర్తి, ¬మ్‌ గార్డ్స్‌ ఆర్‌ఐ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

—-