Wednesday, 4 November 2026

నీట్‌ ర్యాంక్‌తో కుంగిన యువతి

పదంతుస్తుల భవనం పైనుంచి పడి ఆత్మహత్య

హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): నీట్‌ ర్యాంక్లో అర్హత సాధించలేకపోయిన ఓ విద్యార్థినిని ఆత్మహత్యకు పాల్పడింది. పదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్‌ భవనంపై నుంచి దూకి గుర్తు తెలియని ఈ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మయూరి కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలిని బర్కత్‌ పురాకు చెందిన జస్టిన్‌ కౌర్‌(18)గా పోలీసులు గుర్తించారు. నీట్‌ ఫలితాల్లో అర్హత సాధించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై కౌర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కౌర్‌ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

———————