Tuesday, 3 November 2026

ఉస్మానియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

rare surgery in Osmania hospital

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో చెయ్యి దెబ్బతిని తొలగించాల్సిన పరిస్థితిలో ఉస్మానియా వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. చేతిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ వివరాలివి..కర్ణాటక ప్రాంతానికి చెందిన భూమయ్య భార్య లక్ష్మి రోడ్డు ప్రమాదంలో లారీ తొడ నుంచి చేతిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని వైద్యులు చెయ్యిని తీసివేయాలని తెలపడంతో తీవ్ర మనసికక్షోభకు గురైంది. అక్కడ ఓ వైద్యుడు ఇచ్చిన సలహాతో ఉస్మానియా ఆస్పత్రికి వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ నాగప్రసాద్ బృందం ఆమెకు అన్ని పరీక్షలు జరిపి ఛాతిలోంచి కొంత, పొట్ట కింద భాగం నుంచి కొంత ఖండను, చర్మాన్ని తీసి ల్యాటరల్ టొరాసిక్ ప్లాప్‌ను అమర్చింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఖండరాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని వైద్యులు పరీక్షల ద్వారా నిర్ధారించారు. అలాగే తొడ వెనుక భాగంలో పేరుకుపోయిన సిరోమ ద్రవాన్ని 750 మిల్లీ లీటర్లను తొలగించారు. రెండున్నర సంవత్సరాల్లో సుమారు 20 వరకు ఇటువంటి అసాధారణ ఆపరేషన్లు విజయవంతం చేసినట్లు డాక్టర్ నాగప్రసాద్ తెలిపారు. అనస్థిషియా హెచ్‌వోడీ డాక్టర్ రఘురాం బృందం, ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు ప్రవీణ్, శ్రీకర్, శరత్, మహేందర్, మధు, వైద్య సిబ్బంది విజయ సుశీల, దుర్గ, మీన, విజయలక్ష్మి, ఉమా ఈ శస్త్రచికిత్సలో పాలుపంచుకున్నారు. చికిత్స చేయించుకున్న లక్ష్మి మాట్లాడుతూ అవుతాననుకున్న తనకు ఎంతో శ్రమించి చేతిని సాధారణ స్థితికి తీసుకొచ్చిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యక్ష దేవుళ్లగాదేవుళ్లగా అభివర్ణించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *