బిచ్కుంద ఫిబ్రవరి 22 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండలంలోని గుండెకల్లూర్ ఎంపీటీసి సాయిలును పరామర్శించారు. ఇటీవల ఎంపీటీసి సాయిలు కూతురు మరణించడం జరిగింది. దీంతో మంగళవారం నాడు ఆయన మృతురాలు తండ్రికి మరియు కుటుంబ సభ్యులకు పరామర్శించుటకై ఇంటికి వెళ్లారు. కష్ట సుఖాలలో నేనుంటానని మృతుని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే హన్మంత్ షిండే వెంట నాల్చర్ రాజు, అశోక్ పటేల్, సర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ సురేష్, సెక్రటరీ ప్రకాష్ తతదితరులు ఉన్నారు.
ఎంపీటీసి సాయిలును పరామర్శించిన ఎమ్మెల్యే షిండే




