-ఆయా గ్రామాలకు రెండు కోట్ల 30 లక్షల మంజూరుసైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి1;మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలకు రోడ్డు నిర్మాణానికి ప్రత్యేకంగా 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కార్యదర్శు చంద శ్రీనివాస్ ,కాయిత రాములు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి లు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ… గత కొన్నేల్లుగా ఎంపీడీవో ,ఎమ్మార్వో కార్యాలయాలు కు పక్కా భవనాలు నిర్మించినప్పటికీ రోడ్డు సౌకర్యం లేక మండల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన ఆయన నిధులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు.ఇట్టి నిధులతో రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. అలాగే మండలంలోని ఆరేపల్లికు 15 లక్షలు, బొమ్మకల్ కు 10 లక్షలు, ఎగ్లాస్పూర్ కు 15 లక్షలు, ఎలబోతారం కు 10 లక్షలు, ఎల్లంపల్లి కు10 లక్షలు,గోడిశాల కు10 లక్షలు, గుజ్జులపల్లి కు10 లక్షలు, జాగిర్పల్లి కి 20 లక్షలు, నల్ల రామయ్య పల్లె కు15 లక్షలు, పెర్కపల్లి కు10 లక్షలు, రాయికల్ తండా కు 30 లక్షలు, రామచంద్రపురం కు 10 లక్షలు, రాముల పల్లె కు 10 లక్షలు, సోమారం కు 20 లక్షలు, వెంకటేశ్వర పల్లెకు 15 లక్షల రూపాయలను ఎమ్మెల్యే సతీష్ బాబు మంజూరు చేసినట్లు వారు తెలిపారు. అన్ని గ్రామాలకు కలిపి రెండు కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు .ఇంటి నిధులతో త్వరలోనే ఆయా గ్రామాల్లో సిసి రోడ్లను పూర్తి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు .




