మక్తల్ జూలై 30 (జనంసాక్షి) మక్తల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారుల కు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఓటర్ ఇంటికి వెళ్లి నమోదు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు దేశంలో ఒకే ఓటు అనే పద్ధతిలో ఆధార్ కార్డు నమోదు చేసే విధంగా చూడాలని ఆయన కోరారు గరుడ యాప్ లో గాని మీ సేవలో గాని బూత్ లెవెల్ అధికారులు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల పేరు నమోదు చేసుకోవాలని అలాగే సవరణలు కూడా చేసుకోవాలని ఆయన సూచించారు అధికారుల నుంచి వచ్చిన సూచనను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఓటరు నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు
ఎంపీడీవో కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించిన తాసిల్దార్




