ఎంపీపీ కల్లూరి హరికృష్ణను అభినందించిన

ఏసి ప్రతిమా సింగ్
ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి :
కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజదాని లక్నో నగరంలో జరగనున్న జాతీయస్మార్ట్ ఈ  పంచాయతీ వ్యవస్థపై నిర్వహించనున్న జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొనే అవకాశం దక్కిన జిల్లా ఎంపీపీల ఫోరం  అద్యక్షులు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణను బుదవారం  నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ లు ఆయనను శాలువాలతో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఎన్నికై ఢిల్లీలో ఉత్తమ అవార్డు అందుకుని,శివ్వంపేట ఎంపిపిగా సేవలందిస్తున్న హరికృష్ణ పంచాయతీ రాజ్ వ్యవస్థపై పూర్తి అవగాహన కలిగివున్నాడని, అది గుర్తించిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుండి శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణను ఎంపిక చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హత్నుర ఎంపీపీ వావిలాల నర్సింహులు, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ చంద్రాగౌడ్, నర్సాపూర్ జెడ్పీటీసీ బబ్యా నాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area