Thursday, 5 November 2026

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి పై అసత్య ఆరోపణలు చేస్తే తరిమికొడతం

– మళ్లీ పునరావృతం అయితే ప్రజలే బుద్ధి చెప్తరు
– నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కుక్కడపు మహేష్ గౌడ్
హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): మాజీ పిసిసి అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంపై, తీన్మార్ మల్లన్న అసత్య ఆరోపణలు చేస్తే తరిమికొడతామని హుజూర్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షలు కుక్కడపు మహేష్ గౌడ్ హెచ్చరించారు. మరో మారు ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై పిచ్చి ప్రేలాపనలు మానుకోకపోతే యూత్ కాంగ్రెస్ సత్తా చూపెడతామన్నారు. మంగళవారం మల్లన్న వ్యాఖ్యలకు ఖండిస్తు.. హుజూర్ నగర్ పట్టణంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్, అన్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి స్థానిక శాంతి స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మల్లన్న దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కుక్కడపు మహేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ సైన్యంలో యుద్ద విమాన ఫైలట్ గా, అయిదు సార్లు ఎమ్మల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా ప్రజలకు సేవలందిస్తున్న ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మల్లన్నకు లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విలువలు లేకుండా వీడియోలలో ఇష్టం వచ్చినట్లు అసత్య విమర్శలకు పాల్పడితే యూత్ కాంగ్రెస్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. తక్షణమే తన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తన కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కందుల వినయ్, నియోజకవర్గ జనరల్ సెక్రటరీ పులి బాలకృష్ణ, హుజూర్ నగర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడపంగు రాము, గరిడేపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూరి కృష్ణ, నర్సింగ్ ఉపేందర్, పానుగోతు శివనాయక్, కందుల వినోద్, అయిల ఉపేందర్, కార్తీక్, నవీన్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.