– అధికార పార్టీలో అలజడి
– ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆరోపణ
– అధికారిక కార్యక్రమాల్లో దూరంగా ఉంచారంటూ ఆగ్రహం
– దళిత బందు అమలులో సమాచారం లేదంటూ ఆవేదన
చండ్రుగొండ జనంసాక్షి (జులై 07) : ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన లో ఎంపీపీ భానోత్ పార్వతి నుండి నిరసన సెగలు తగిలాయి. దాంతో అధికార పార్టీలో అలజడి బహిర్గతమైంది. ఇన్నాళ్ల ఆవేదనను ఒక్కసారిగా ఆమె ఎంపీ ముందు వెళ్లగక్కారు. గురువారం చండ్రుగొండ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన నామా ఎదురుగా ఎంపీపీ పార్వతి నిరసనకు దిగారు. తాను అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎటువంటి సమాచారం లేకుండా కొంతమంది ఒక తాము వర్గంగా ఏర్పడి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.దళిత బందు అమలులో తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. తమకు అనుకూలమైన వారికి రైతుబంధు కట్టబెట్టారని ఆరోపించారు కనీసం మండల ప్రథమ పౌరురాలిగా పార్టీలో కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవప్రద స్థానంలో ఉన్న నన్ను మహిళ నని చిన్నచూపు చూస్తున్నారన్నారు. స్పందించిన ఎంపీ ఈ విషయమై మాట్లాడతానన్నారు. ఈ సందర్బంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం అక్కడే ఉన్నారు వారి ముందే ఈ తతంగం జరిగింది.
Attachments area




