Sunday, 8 November 2026

ఎంపీ రవిచంద్ర కు గణపతి లడ్డు బహుకరించిన సీఈఓ సుమన్ గౌడ్

దంతాలపల్లి సెప్టెంబర్ 11 జనం సాక్షి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అహల్య గ్రూప్ సీఈవో జలగం సుమన్ గౌడ్ గణపతి లడ్డును  ఆదివారం హైదరాబాదులోని ఎంపీ రవిచంద్ర నివాసంలో తన సోదరి మండలంలోని బొడ్లాడ గ్రామ సర్పంచ్ మండ సుష్మ గౌడ్ తో కలిసి బహుకరించారు. బంజారా హిల్స్ లో  శ్రీ వెంకటేశ్వర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి లడ్డు రెండు లక్షల 26 వేలకు వేలంపాటలో దక్కించుకొని బహుకరించగా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారన్నారు.
Attachments area