ఎంసిపిఐయు జాతీయ కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలి
సూర్యాపేట టౌన్(జనంసాక్షి) : ఈనెల 21న హైదరాబాద్ లోని ఎంసిపిఐయు రాష్ట్ర కార్యాలయంలో జరుగనున్న పార్టీ జాతీయ కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.నవంబర్ 12 నుంచి 15 వరకు బీహార్ రాష్ట్రంలో జరిగే పార్టీ జాతీయ మహాసభల నిర్వహణ గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశానికి 18 రాష్ట్రాల నుండి పార్టీ పోలిటి బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు ,ఆయా రాష్ట్రాల కార్యదర్శులు హాజరై జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల గురించి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ , పోలిటి బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గాదగోని రవి, ఏపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కాటం నాగభూషణం తో పాటు తెలుగు రాష్ట్రాల కేంద్ర కమిటీ సభ్యులు హాజరు కానున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు ఎస్ కె. నజీర్ , ఏపూరి సోమన్న , నలుగురి రమేష్ , వేముల పెద నరసయ్య , సుధీర్ , కోటయ్య , మూరపాక ఉగ్రయ్య , లింగంపల్లి ఓంకారం తదితరులు పాల్గొన్నారు.