ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):ఎంసిపిఐయు
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు ఈనెల 9,10వ తేదీలలో , రాష్ట్ర కమిటీ సమావేశాలు 11,12వ తేదీలలో హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ భవన్ లోని కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి హాల్ లో జరుగనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పలవెంకన్న తెలిపారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశాల్లో వర్తమాన రాజకీయ పరిణామాలు , పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం , సెప్టెంబర్ 21న జరిగే పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల సమాచారం, అక్టోబరు 17న జరిగే ఓంకార్ వర్ధంతి సభతో పాటు వారోత్సవాల సభపై చర్చించనున్నట్టు తెలిపారు.బిఎల్ఎఫ్ నిర్మాణంతో ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు , మునుగోడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయం, నవంబర్ 10 నుండి 15 వరకు బీహార్ లో జరిగే పార్టీ ఐదవ జాతీయ మహాసభలకు ప్రతినిధుల ఎంపిక , 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ స్థానాల గుర్తింపు , అభ్యర్థుల ఎంపిక గురించి కూడా ఈ సమావేశాల్లోనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కె నజీర్ , సహాయ కార్యదర్శి ఏపూరి సోమన్న , జిల్లా కమిటీ సభ్యులు ఉగ్రయ్య , కోటయ్య , రమేష్ , నరసన్న , సుధీర్ , వేణు , శ్రీను, ఓంకార్, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.