ఎం ఎల్ ఏ నూ పరామర్శించిన ఆర్మూర్ ప్రేస్ క్లబ్ సభ్యులు

జనం సాక్షి ఆర్మూర్ రూరల్
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టి మురళి ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు పరామర్శించారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యేను వివరాలు అడిగి తెలుసుకుని హత్యకు పాల్పడ్డ ప్రసాద్ గౌడ్ వీడియో ఫోటోలను స్క్రీన్ పై చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి దుర్ఘటనలు పునవ్రతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ప్రజా ఆశీర్వాద బలం ఎమ్మెల్యే వెంట ఉంటుందని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు భరోసా కల్పించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించిన వారిలో అబ్దుల్ అజీమ్, నెమలి ప్రశాంత్, పొన్నాల చంద్రశేఖర్, చక్రి, రాజేష్, సునీల్, రాకేష్, శ్రీనివాస్ గౌడ్, ముత్యం, దొండిమోహన్, విజయ్ ప్రతాప్ చావ్లా, గుండు నాగరాజు, కలిగోట చిన్న, ఇందారపు రాజు, గడ్డి ప్రకాష్, విజయ్, రితీశ్ లు ఉన్నారు.

తాజావార్తలు