హైదరాబాద్,ఆగస్టు30 : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు విరుచుకుపడ్డారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ లీజును ముఖ్యమంత్రి కేసీఆర్ రద్దు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. 2015లో ఇచ్చిన హావిూ మేరకు సొసైటీకి భూమి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. లీజు రద్దుతో నిర్వాహకులు, విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలపై కాకుండా ఆంధ్రావారిపై ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు.




