వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం,ఆగస్టు30 : చత్తీస్గఢ్ విూదుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించిన అల్పపీడనం మరింత తీవ్రరూపం దాల్చింది. సముద్రమట్టానికి 7.6 కిలోవిూటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి గుజరాత్ దిశగా కదులుతోంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ మేరకు వాతావరణశాఖ వెల్లడించింది. వాయగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలపై రుతుపవనాలు బలంగా కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. విశాఖపట్టణం విూదుగా రుతుపవన ద్రోణి పయనిస్తోందన్నారు. రాయలసీమ విూదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబరు 2న కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన ఉందని వెల్లడించారు.