Monday, 2 November 2026

2019 లో కాంగ్రెస్‌ కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదు

మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారని చేస్తున్న

ప్రచారం ఆపాలన్న మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌,ఆగస్టు30  : కాంగ్రెస్‌ పార్టీలో నిరాశా నిస్పృహలు తారా స్థాయికి చేరాయని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు అన్నారు. అందుకే కాంగ్రెస్‌ నేతలు మరింత దిగజారి టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు టచ్‌ లో ఉన్నారని అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం మంత్రి హరీశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని, హస్తం పార్టీ మునిగిపోతున్న నావ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష ¬దా కోల్పోయిన కాంగ్రెస్‌ 2019లో తెలంగాణలో కూడా ప్రతిపక్ష ¬దా కోల్పోక తప్పదని హెచ్చరించారు. పొద్దున లేస్తే వెంట ఎవరు ఉన్నారో, ఎవరు పోయారో అని వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన దుస్థితిలో కాంగ్రెస్‌ ఉందన్నారు. ఎన్నికల నాటికి ఎందరుంటారో, ఎందరు పోతారో కాంగ్రెస్‌ కే తెలియదని చెప్పారు. ఇప్పుడున్న పది మందైనా చివరి వరకు ఉంటారో లేదోచూసుకోండన్నారు. కాంగ్రెస్‌ నేతలు దిక్కు మాలిన మైండ్‌ గేమ్‌ లు చాలించాలని మంత్రి హరీశ్‌ రావు హితవు పలికారుప్రగతి పథంలో తెలంగాణముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోందని మంత్రి హరీశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రతీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు ఏ కోశానా కనిపించడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టు కేసులు వేసి అడ్డుకుంటున్నా సరే, శరవేగంగా అభివృద్ది ముందుకు పోతోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ నాయకులకు భవిష్యత్‌ భయం పట్టుకున్నదన్నారు. అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌ కు చేరువ కావడాన్ని కాంగ్రెస్‌ నాయకులు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. మళ్లీ అధికారంలోకి రాలేమోననే బెంగ పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకుంటే బతకడం ఎలా అనే మానసిక వ్యధ వారిని అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకునేలా ప్రేరేపిస్తున్నదని వ్యాఖ్యానించారు.

భూ రికార్డులు సరి చేస్తామంటే విమర్శలా?

భూ రికార్డులను సరిచేస్తామంటే కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిజాం కాలంలో భూ సర్వే జరిగిందని, ఆ తర్వాత మళ్లీ సర్వే జరగలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం రికార్డులన్నీ గందరగోళంగా ఉన్నాయని, గ్రామ సభలు పెట్టి, రైతుల భాగస్వామ్యంతో ప్రభుత్వం రికార్డులు సరిచేయాలనుకుంటున్నదని ఆయన వెల్లడించారు. భూ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, రైతులకు భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాలని సర్కార్‌ కోరుకుంటోందని తెలిపారు. దీనికి కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? రికార్డులు అస్తవ్యస్తంగా ఉంటే భూ కబ్జాలకు, అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని, అలాంటి అవకాశం పోతుందని కాంగ్రెస్‌ నాయకులు బాధ పడుతున్నారా? వారు చేసిన భూ దందాలు బయటకు వస్తాయని జంకుతున్నారా? బినావిూ భూములు కోల్పోతామని వణుకుతున్నారా? అని ప్రశ్నించారు. కోర్టుకెళ్లి మరీ భూ రికార్డుల ప్రక్షాళనను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించడం వారి నైరాశ్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతీ పనిని కోర్టుకు పోయి అడ్డుకుంటున్నదని తాము చెప్పిన మాటలు అక్షర సత్యాలని మరోసారి రుజువైందన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ సర్కారుది ఉద్యమ స్పూర్తి ఉన్న ప్రభుత్వమని మంత్రి హరీశ్‌ రావు తేల్చిచెప్పారు. తెలంగాణ రైతుల బాధలు తెలిసిన ప్రభుత్వమని, రైతులను అప్పుల ఊబిలోంచి బయట పడేయాలని, వ్యవసాయాన్ని లాభసాటి చేయాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్న ప్రభుత్వం తమ దన్నారు. కాంగ్రెస్‌ నేతల పిచ్చి చేష్టలతో, కుట్రలతో రైతులకు మేలు చేసే మా చిత్తశుద్ధిని, ఏకాగ్రతను భగ్నం చేయలేరన్నారు.