Wednesday, 4 November 2026

ఎద్దు చనిపోయిన కుటుంబానికి రూ. 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత

 

 

 

 

 

జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్ల గ్రామానికి చెందిన పులి తిరుపతి లక్ష్మీ వ్యవసాయానికి సంబంధించిన ఎద్దు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం ఆర్థిక బాధలో ఉన్నదని తెలుసుకొని లైన్స్ క్లబ్ సభ్యులు డైరెక్టర్ కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ గంట వెంకటరమణారెడ్డి గారు కరీంనగర్ కు చెందిన పెంచాల సరస్వతి మురహరి రావు అడ్వకేట్ దృష్టికి తీసుకుపోగా వారు వీరి కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించినారు. ఆర్థిక సహాయాన్ని గురువారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి ఆర్గనైజర్ టీవీ సురేష్ బాబు కళాధర్ రెడ్డి దొడ్ల శ్రీనివాస్ వార్డ్ మెంబర్ భాగ్యలక్ష్మి, బిరుదు లక్ష్మణ్, కొలిపాక సరా, పులి స్వప్న పాల్గొన్నారు.