Wednesday, 4 November 2026

ఎన్ఎమ్ఐడీసీ హైదరాబాద్ మారథాన్ క్రీడల ఎక్స్ పో ప్రారంభం

ఖైరతాబాద్: ఆగస్టు 27 (జనం సాక్షి) ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్తో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, ఎన్ఎమ్ఎసీ హైదరాబాద్ మారథాన్ 11 వ ఎడిషన్ ఎన్ఎమ్ఎసీ హైదరాబాద్ మారథాన్లో మారథాన్ ఎక్స్ పోని ప్రారంభించాయి. ఈ 3 రోజుల మారథాన్లో హైదరాబాద్ రన్నర్స్ భాగస్వామ్యంతో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సరికొత్త ఫిట్నెస్, వెల్నెస్ ఉత్పత్తులు, సేవల గురించి తెలిపే భారతదేశ ప్రీమియర్ క్రీడల ఎక్స్ పో అయిన క్రీడల ఎక్స్ పో ఇండియా 2022 కూడా ఉంటుంది. సుమిత్ దేబ్ సీఎండీ, ఎన్ఎమ్ఎసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సిఎమ్ఎ నారాయణ్ టీవీ, ప్రశాంత్ మోర్పారియా, ఎన్ఎమ్ఎసి హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సహకారంతో ఎన్ఎమ్ఎసి హైదరాబాద్ మారథాన్ క్రీడల ఎక్స్ పోని ప్రారంభించారు. ఎన్ఎమ్ఎసీ హైదరాబాద్ మారథాన్ 2022 రేసులో 4 కేటగిరీల్లో నమోదైన రన్నర్లు అందరూ తమ బీటిని, కిట్ బ్యాగులని తీసుకుంటారని తెలిపారు. ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10 కి పరుగుల కోసం రిజిస్టర్ చేసుకున్న రన్నర్లు ఆగస్టు 26 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఆగస్టు 27 న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ బిబ్లని తీసుకోవచ్చన్నారు. 5 కె రన్ కోసం రిజిస్టర్ చేసుకున్న రన్నర్లు ఆగస్టు 26 న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే ఇవి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. క్రీడల ఎక్స్ పో ఇండియా 2022 క్రీడల గురించి మాత్రమే జరిగే 3 రోజుల ఈవెంట్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో సరికొత్త క్రీడలు, ఫిట్నెస్, వెల్నెస్ ఉత్పత్తులు, సేవల గురించి జరిగే భారత దేశపు ప్రీమియర్ క్రీడల ఎక్స్ పో, ప్రజలు, ఫిట్నెస్ ఔత్సాహికులు తమ ఆరోగ్యాన్ని, జీవనశైలిని పెంపొందించుకోవడంలో సహాయ పడటానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, క్రీడా పరికరాలు, సౌకర్యాలు, సేవలు, పోషణని ప్రదర్శించడానికి ఈ ఎక్స్ పోని ప్రత్యేకంగా రూపొందించారని తెలిపారు. 10 కి రన్ హైటెక్స్ గ్రౌండ్స్ నుంచి ప్రారంభమయ్యి ఐకియా సర్కిల్ సమీపంలోని హాఫ్, ఫుల్ మారథాన్ మార్గంలో విలీనం అవుతుందని, ఇది గచ్చిబౌలి స్టేడియంలో ముగుస్తుందన్నారు.