డోర్నకల్ ఆగస్టు 26 జనం సాక్షి
తెరాస మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ మాతృమూర్తి కళ్లపు సత్యమ్మ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి సత్యమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం డోర్నకల్ పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన మధురై నాగరాజన్ (52) కుటుంబాన్ని పరామర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట డివైగిరి,లాలూ నాయక్,జగదీష్,బానోతు శ్రీను,రాజుపుత్ నాయక్,హరికృష్ణ,శీలం శ్రీను,వీరస్వామి,అనంతుల ఉపేందర్,బావు సింగ్,పాషా,మాలోతు హరి నాయక్,పర్తి నాయక్ తదితరులు ఉన్నారు.




