ఎన్జీరంగ అగ్రికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ వ్యక్తిని నియమించాలి:కోదండరాం

హైదరాబాద్‌: ఎన్జీరంగ అగ్రికల్చరల్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తినే నియమించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. ఈ రోజు కోదండరాం మీడియాతో మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగం విశ్వవిద్యాలయం వీసిగా తెలంగాణ వ్యక్తిని నియమించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ రైతులకు న్యాయం జరగాలంటే తెలంగాణ వ్యక్తినే నియమించాలని లేని యేడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.