Wednesday, 4 November 2026

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యుల నివాళి

హైదరాబాద్‌,మే28(జ‌నం సాక్షి ): దివంగత ఎన్నీఆర్‌కు ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు గనంగా నివాళి అర్పించారు.  సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు జయంతి కావడంతో ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు గనంగా నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ, మనవలు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. ట్యాంక్‌బండ్‌ సవిూపంలోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న వారంతా ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్ఫాలు ఉంచి నివాళులర్పించారు. దర్శకుడు క్రిష్‌ కూడా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని అన్నారు. ఎన్టీఆర్‌ జీవిత విశేషాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.