ఎన్నారంలో చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి

 రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి) మండల కేంద్రంలోని ఎన్నారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం  మహిళలకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను గ్రామ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి  గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళలకు ప్రతి సంవత్సరం కానుకగా బతుకమ్మ చీరలను అందించాలని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వడ్డీ లేని రుణాలతోపాటు మహిళలకు ఉపయోగపడే కొత్త పథకాలు అందించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ ఏనుగు పుషమ్మ వెంకట్ రెడ్డి , ఉప సర్పంచ్ పల్సం బిక్షం , పాలకవర్గం సభ్యులు సత్యమ్మ , జాల ఉమరమేష్ ,మదే ఉమకృష, దేశపాక లక్ష్మణ్,రేషన్ డీలర్ తదితరులు పాల్గొన్నారు.