– దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్5 (జనం సాక్షి) : ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో అగ్ని మాపక వాహనాన్ని, తాత్కాలిక అగ్ని మాపక కేంద్రాన్ని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానయాక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమం చేపడుతోందని, అందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించి వాటిని తీర్చడంలో మా ప్రభుత్వం చిత్త శుద్దితో ఉందని మంత్రి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. గతకొన్ని సంవత్సరాల ఖానాపూర్ ప్రజల కల నెరవేరిందన్నారు. ఎప్పుడు ఏ అగ్ని ప్రమాదం జరుగుతుందో.. ఎంత ఆస్తినష్టం జరుగుతుందో అనే భయం పోవడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమిలన్నీ నేరవేర్చానని అన్నారు. ఈ ఒక్క అగ్నిమపక కేంద్రం నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.




