Thursday, 5 November 2026

ఎన్నికల హావిూలను తుంగలో తొక్కిన సిఎం కెసిఆర్‌: సిపిఐ

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల్లో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు దాన్ని మరచిపోయారని సిపిఐ దుయ్యబట్టింది. ఎన్నికల హావిూలను తుంగలో తొక్కి నిరంకుశ నిజాం పాలనకు తెరలేపుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉందని, కేవలం తెరాస ఒక్కటే పోరాడి తెచ్చినట్లు భావించడం సరికాదన్నారు. బంగారు తెలంగాణ సాధనలో అన్ని పార్టీలను, రాజకీయ పక్షాలను కలుపుకొని పోవాలని సూచించారు. కొత్త పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి చూపిస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉన్న సిర్పూర్‌ పేపరు మిల్లును మూసి వేసిందన్నారు. ఈ మిల్లుకు సంఘం అధ్యక్షునిగా ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కార్మికులకు భరోసా లేకుండా పోయిందన్నారు.  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెరాస ఆచరణ సాధ్యంకాని హావిూలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఇదిలావుంటే బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరోవైపు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయను  జిల్లాకు చెందిన పలువురు బిజెపి  నాయకులు హైదరాబాద్‌లో కలిశారు. బీడీకార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బీడీకట్టలపై 85 శాతం గొంతుక్యాన్సర్‌ బొమ్మను ముద్రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జరుగుతున్న ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గొంతుక్యాన్సర్‌ బొమ్మను ముద్రించాలని కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదని వీరితో మంత్రి పేర్కొన్నట్లు నేతలు తెలిపారు. బీడీకార్మికులు ఆందోళన చెందాల్సిన

అవసరం లేదని, కార్మికుల సంక్షేమానికి కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన హావిూ ఇచ్చినట్లు చెప్పారు. కార్మికులందరికీ గుర్తింపుకార్డులు జారీచేయడంతో పాటు త్వరలో జిల్లాలో జరగనున్న బీడీకార్మిక సదస్సుకు హాజరయ్యేందుకు మంత్రి అంగీకరించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *