Thursday, 5 November 2026

18న సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): జిల్లాలో  సేవాలాల్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ 10 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేరేఖానాయక్‌ తెలిపారు. సేవాలాల్‌ జయంతిని ఆదిలాబాద్‌లోని రాంలీలా మైదానంలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని ఉత్సవకమిటీ గౌరవఅధ్యక్షులు జాలంసింగ్‌ కోరారు. అదేవిధంగా మహరాజ్‌ ఆలయనిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించాలన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌  ఎం.జగన్మోహన్‌ వెల్లడించారు. ఉత్సవకమిటీ, అధికారులతో కలెక్టర్‌  సవిూక్ష నిర్వహించి పలు అంవాలపైన చర్చించారు. బంజారాల కులదైవమైన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను ఈనెల 18న మండలస్థాయిలో, 20న జిల్లాస్థాయిలో నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలకు అధికారికంగా జయంతిని నిర్వహించాలని ఎన్నిమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఎమ్మెల్యే రేఖానయక్‌  గుర్తుచేశారు. గ్రామాలు, తండాలలో, బంజారాలు జయంతి ఉత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారని తెలిపారు.
లె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *