ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్
పానుగల్ సెప్టెంబర్ 21,జనం సాక్షి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం శెట్టి తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ వాలంటీర్లు కళాశాలలోని చెత్తాచెదారాన్ని తొలగించి, మొక్కలకు పాదులు చేసి, శ్రమదాన కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. అదేవిధంగా మొక్కల సంరక్షణ బాధ్యతను విద్యార్థులు స్వయంగా తీసుకోవాలని, విద్యార్థినీ విద్యార్థులు కళాశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థిని విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Attachments area