ఎన్.ఎస్.యు.ఐ నిర్మల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా విద్యార్థి నేత అంజద్ షేక్

భైంసా రూరల్ ఆగస్టు 10జనం సాక్షినిర్మల్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన విద్యార్థి నాయకుడు అంజద్ షేక్ ను నియమిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బలుమూరు వెంకట్ ప్రకటనలో తెలియజేశారు.
గతంలో మండల స్థాయి నాయకుడు నుంచి జిల్లా స్థాయి నాయకుడిగా విద్యార్థుల పక్షాన పోరాడుతు, విద్యార్థుల స్కాలర్షిప్లు ఫీజు నెంబర్స్మెంట్ కొరకు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తెలిసిన నాయకుడిగా అనునిత్యం విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం చేసే నాయకులకు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు గుర్తిస్తుందని, ఈ సందర్భంగా ఏ.ఐ.సి.సి నుండి జాతీయ బాధ్యులు జే.ఎన్.యు.విద్యార్థి నేత కన్నయ్య కుమార్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి అజయ్ లక్రా గారి సారథ్యంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు గాంధీ భవన్ నుంచి ప్రకటన వెలువడిందని ఆయన తెలిపారు. దీనికి సహకరించిన నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షులు కూచడి శ్రీహరిరావు కి కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గ బాధ్యులు శిందె ఆనంద్ పటేల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన పట్ల నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి,జిల్లా వ్యాప్తంగా విద్యార్థిని- విద్యార్థుల సంక్షేమం కొరకు రాజీలేని పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.