ఎఫ్ఎల్ఎన్ తొలి మెట్టు కార్యక్రమం విజయవంతం

నంగునూరు, సెప్టెంబర్20(జనంసాక్షి):
ప్రాథమిక స్థాయిలో విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం కావడానికి పాఠశాల తనిఖీలో భాగంగా నంగునూరు మండల నోడల్ అధికారి పి ప్రభాకర్ రావు మండల టీం సభ్యులు ఆర్పీలు కుమార్ నాగయ్య, సిఆర్పి అశోక్ లు సోమవారం రోజు మండలంలోని బద్దిపడగ దర్గపల్లి జెర్రిపోతుల తండా నంగునూరు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి, తొలిమెట్టు కార్యక్రమంలో బేస్ లైన్ పేపర్లను గ్రేడ్లను పరిశీలించడం జరిగింది. ఉపాధ్యాయులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్షరాస్యతను విద్యాభివృద్ధిని పెంచాలని నోడల్ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత దేవేందర్ చంద్రము ఎనగందుల మనీష్ కుమార్  పాఠశాల ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆదేశాలను పాటిస్తామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య, చంద్రము, దేవేందర్ లు పాల్గొన్నారు.
Attachments area