ఎమ్మెల్యేను సన్మానించిన కుర్తి రావుల చెరువు మైనార్టీ నాయకులు
మల్దకల్ జూలై 21(జనంసాక్షి) గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మల్డకల్ మండల పరిధిలోని కుర్తి రావులచెరువు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు ఉర్దూ ఘర్ కమ్ షాది ఖానా నిర్మాణం ప్రభుత్వ నుండి ఉత్తర్వులు జారీ చేసి 30 లక్షల వ్యయంతో నిర్మాణం చేయడానికి కేటాయించి నందుకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్,మంత్రివర్యులు హరీష్ రావు,కేటీఆర్,ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీకి ఎల్లప్పుడు రుణపడి ఉంటామని మైనార్టీ నాయకులు తరఫున తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్,ఎంపీపి రాజారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులునరసింహారెడ్డి, ఆంజనేయులు,మహబూబ్ ఆలీ,గజ్జలన్న, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.