మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన చైర్పర్సన్ పుట్ట శైలజ
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని శుక్రవారం మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీల,బాలింతల, శిశువుల ఆరోగ్య పరిస్థితులను తెల్సుకుని వర్షా కాలంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.