ఎమ్మెల్యే అత్యాచారం వెనక భర్త ప్రోత్సాహం

మహిళ ఫిర్యాదుతో కదిలిన పోలీస్‌ యంత్రాగం

న్యూఢిల్లీ,జూలై9(జ‌నం సాక్షి): తనపై అత్యాచారం జరిపిన ఎమ్మెల్యేకు తన భర్తే సహకరించాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అల్గాపూర్‌ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎఐయుడిఎఫ్‌ ఎమ్మెల్యే నిజాముద్దీన్‌ చౌదరి మే 19, 23 తేదీల్లో రెండు సార్లు తనపై అత్యాచారంజరిపారని ఆమె పోలీసులను అశ్రయించింది. హెయ్‌లకండి సర్క్యూట్‌ హౌస్‌లో ఈ దారుణం జరిగినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. రెండు సార్లూ ఆ ఎమ్మెల్యేకు తన భర్తే సహకరించాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఆ తరువాత సదరు ఎమ్మెల్యే తనను గువాహటికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించగా, తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడని తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తాను ఇంటి నుంచి బయటకు రాకుండా తన భర్త అడ్డుకోవడంతో ఇన్నాళ్ళు ఫిర్యాదు చెయ్యలేకపోయానని, చివరికి తప్పించుకుని వచ్చానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

————–