Wednesday, 4 November 2026

ఓఎన్‌జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌

రాజమహేంద్రవరం,జూలై9(జ‌నం సాక్షి): తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం తూర్పపాలెం వద్ద సోమవారం ఉదయం ఓఎన్‌జీసీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకయింది. కేశనపల్లి జీసీఎస్‌ సవిూపంలోని 15వ నెంబరు బావికి చెందిన పైపులైన్‌ నుంచి గ్యాస్‌ బయటకు రావడంలో స్థానికులు భయాందోళన చెందారు. అధికారులు, ఓఎన్‌జీసీ సిబ్బంది మరమ్మతులు చేసి గ్యాస్‌ లీకేజీని నియంత్రించారు. తుప్పుపట్టిన పైపులైన్ల కారణంగా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కోన సీమవాసులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.