ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 10,
జనం సాక్షి :
మెట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల మాట్లాడుతూ,
బండి సంజయ్ చేపట్టిన ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఖండించారు. బండి సంజయ్ మాటలు అన్ని జూట మాటలే అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ల వల్ల ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. బండి సంజయ్ ఒక పార్ల మెంట్ సభ్యులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సమంజసం కాదన్నారు,పదే పదే కవిత జైలుకు పోతుంది అని అంటున్నారు, తప్పు చేస్తే జెల్ కు ఎవరైనా పోవుడే, అని కవితనే స్వయంగా అన్నారని, కెసిఆర్, కేటీఆర్ ,హరీష్ రావు, కవితలు ఎవరైనా తప్పు చేస్తే ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వీరిని ఎంత విమర్శిస్తే వారు అంత అభివృద్ధి చెందుతున్నారని, అలాగే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాకంటే 10% అభివృద్ధి లేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ తెగదింపులు చేసుకొని పోతుందని రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానాన్ని ఖండించారు , కేసిర్ భారతదేశం అంతా అభివృద్ధి దిశగా పయనింపచేస్తారన్నారు
బీఆర్ఎస్ పార్టీని, భారత దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని విద్యాసాగర్ రావు అన్నారు.
ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనుల నిమిత్తం 26.98 కోట్ల నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కెసిఅర్,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ కు 14.83 కోట్లు, ఆర్ అండ్ బి కు 12.15 కోట్లరూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కు నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియచేసారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రెస్ మీట్




