ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన టిఆర్ఎస్ నాయకులు దేవేందర్

రేగోడ్ /జనం సాక్షి సెప్టెంబర్:
రేగోడు మండల పరిధి చౌదర్పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శివమ్మ అను వ్యక్తి అనారోగ్యంతో బాధపడి ఇబ్బందులకు గురికాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా వారి కుటుంబానికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రూపాయలు రెండు లక్షల 50 వేలు ఎల్ వో సి పత్రాన్ని మంజూరు చేయడంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతిథంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. కాగా కుమ్మరి శివమ్మ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులకు గురి కాగా వారి కుటుంబానికి ఎల్ వో సి పత్రాన్ని మంజూరు చేసి ఆదుకోవ డంతో హర్షం వ్యక్తం చేశారు. సంతోషంతో శివమ్మ పేరును. చెప్పబోయి, గతంలో మృతి చెందిన రాముల పేరును చెప్పినట్లు తెలిపారు. శివమ్మ కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం గర్వకారణం అన్నారు. కృతజ్ఞతలు తెలిపిన వారిలో డి నారాయణ డి కిష్టయ్య, జి విఠల్, డి పద్మ్మయ్యలు ఉన్నారు.