ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి.

గుడిహత్నూర్: ఆగస్టు 20 (జనం సాక్షి) ఆర్ఎస్ఎస్ సంస్థ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను  వెంటనే అరెస్ట్ చేయాలనిడిమాండ్  చేస్తూ బస్టాండ్ ఎదుట బీజేపీ, బిజెవైఎం నాయకులు ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనంచేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాపురావ్  మండల కేంద్రంలోని ఒక కార్యక్రమానికి హాజరై సభలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై చేసిన అనిచిత వ్యాఖ్యలను తీవ్రంగా  ఖండిస్తోందని అన్నారు అన్నిటిని త్యాగం చేసి సామాజిక సేవలో అందరికన్నా ముందుండే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కేవలం ఒక వర్గాన్ని సంతోష పెట్టాలన్న ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ దోషించడం సరికాదన్నారు  వెంటనే క్షమాపణలు చెప్పాలని లేనియెడల  జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.  అనంతరం ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని  బీజేవైఎం ,బిజెపి నాయకులు  పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భరత్ పిఎసిఎస్ చైర్మన్ సంజు ముండే, బిజెపి మండల అధ్యక్షుడు జాడి సుభాష్, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి  కేంద్రే లక్ష్మణ్ తరుణ్ గీత్తెే, శివ తదితరులు పాల్గొన్నారు.