ఎమ్మెల్యే విశృత పర్యటన.

 

.జనంసాక్షి.జూలై21
నేరెడ్ మెట్ డివిజన్ పరిధిలోని యప్రాల్ లక్ష్మీ పూరి కాలని లో 60 లక్ష లతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం కార్పొరేటర్ మినా ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించడం జరిగింది. అనంతరం వివిధ శాఖల అధికారులు హెచ్ఎండిఎ,ఇరిగేషన్,జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆర్కె పురం చెరువును పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. చెరువు సుందరికరణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం గౌతం నగర్ డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనిలో 10లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను కార్పొరేటర్ సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం గౌతం నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈకార్యక్రమంలో హెచ్ఎండిఎ డిఈ పద్మా, ఇరిగేషన్ డిఈ పవన్,ప్రాజెక్టు అధికారులు గోపాల్,డిప్యూటీ కమిషనర్ రాజు,ఈఈ లక్ష్మణ్,డీఈ మహేష్,ఏఈ సృజన,కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి,గుండా నిరంజన్,మహత్యవర్ధన్,ఎస్ ఆర్ ప్రసాద్,చిత్ర గోకుల్,చెన్నారెడ్డి,రమేష్, సతీష్ కుమార్,యాదగిరి,రాజు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు