ఎమ్మెల్యే సహకారంతో రంగంపేట అభివృద్ధి * 40 లక్షల సిసి రోడ్లు మంజూరు * ఎమ్మెల్యే కు రుణపడి ఉంటాం
జనం సాక్షి /కొల్చారం నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి రమేష్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. గ్రామం అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయలు ఎమ్మెల్యే మదన్ రెడ్డి మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో గ్రామానికి 20 లక్షల రూపాయలు మంజూరైనట్టు వారు తెలిపారు సిసి రోడ్ నిర్మలంతో పాటు డ్రైనేజ్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, సొసైటీ మాజీ చైర్మన్ వి పి మల్లేశం, సొసైటీ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, బి ఆర్ఎస్ నాయకులు కంచర్ల నాగరాజ్, సిద్ధి రాములు, జయరాజ్ గౌడ్, గౌస్పాషా తదితరులు పాల్గొన్నారు