ఎమ్మెల్లే ఔదార్యం…

నల్గొండ బ్యూరో, జనం సాక్షి
..నల్గొండ 37 వ వార్డుకు చెందిన బి. సురేష్ నేపాల్ నుండి వచ్చి ఇక్కడ టీ బంకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు..ఇతనికి భార్య మైరావతి 5 సంవత్సరాల పాప 8నెలల బాబు ఉన్నారు.వారం రోజుల క్రితం భార్యకు dengue జ్వరం రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిల చుట్టూ తిరిగి దాచుకున్న 120000 ఖర్చు చేసాడు…డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.. ప్లేట్ లెట్స్ తగ్గడం ఇన్ఫెక్షన్ రావడంతో ఈ రోజు తెల్లవారుజామున మరణించింది..స్థానిక mla భూపాలరెడ్డి వెంటనే స్పందించి 20000 ఆర్ధిక సహాయం అందించడం తో పాటు మునిసిపల్ అధికారులతో మాట్లాడి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు..విషయం తెలుసుకున్న మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి బాధిత కుటుంబానికి10000 ఆర్థిక సహాయం అందిచ్చారు..వార్డుకు చెందిన ఇంఛార్జి భాస్కర్ ,మల్లయ్య,జానీ, రామాచారి,శ్రీను తదితరులు నేపాల్ యువకుడికి అన్ని విధాలా అండగా నిలిచారు